ఆలేరులో మూడు ఇంటర్ పరీక్షా కేంద్రాలు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 3 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, వి ఆర్ జూనియర్ కళాశాల, ఆర్ పి ఆర్ పి కళాశాలలో విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈనెల 25 నుండి మార్చి 16 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు పరుస్తూ బందోబస్తు ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply