మాజీ జెడ్పిటిసి కృష్ణారెడ్డి తల్లి మృతి… ప్రజాప్రతినిధుల పరామర్శ

మాజీ జెడ్పిటిసి కృష్ణారెడ్డి తల్లి మృతి… ప్రజాప్రతినిధుల పరామర్శ

భీమ్రావుపల్లి ,ఆంధ్ర ప్రభః నార్సింగి మండల మాజీ జెడ్పిటిసి బాణాపురం కృష్ణారెడ్డి తల్లి బాణాపురం నరసమ్మ ఆరోగ్యం బాగాలేక కొంపల్లిలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న భీమ్రావుపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డ్ సభ్యుడు బోయిని భూషణం, సర్పంచ్ కీష్ట జనార్ధన్, ఉప సర్పంచ్ మనోహర్, వార్డు సభ్యులు గర్జన అశోక్, కిష్ట బిక్షపతి, కాపు రఘుపతి తదితరులు కొంపల్లిలోని కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a Reply