Mopidevi | సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

Mopidevi | మోపిదేవి, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఉదయం దర్శించుకున్నారు. వేద పండితులు, ఆలయ కార్య నిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు మంత్రికి స్వాగతం పలుకుగా, తొలుత నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెండు మూడు నెలలకు ఒకసారి స్వామివారిని ఆయన ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటున్నారు. ఆలయ ఈవో ఆయనకు స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నడకుదుటి జనార్దన్ రావు, రావి నాగేశ్వర రావు, రావి రత్నగిరి, తహసీల్దార్ హారనాథ్ తదితరులు పాల్గొన్నారు.
