Grameena bank | ఆ.. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

Grameena bank | ఆ.. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

Grameena bank, చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను బ్యాంక్ ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ గ్రామ బ్రాంచ్ మేనేజర్ హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఎంవీ రూరల్ ఫోల్క్ ఆర్ట్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం బ్యాంక్ దండు మల్కాపూర్ బ్రాంచ్ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా పాటల ద్వారా, మాటల ద్వారా, మ్యాజిక్ షో ద్వారా గ్రామస్తులకు అర్ధమయ్యే రీతిలో సైబర్ మోసాల పై, అటల్ పెన్షన్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జీవనజ్యోతి భీమా యోజన పథకం, ఖాతాల రీకేవైసీ వివరాల గురించి ఖాతాదారులకు అవగాహన కల్పించారు. బ్యాంక్ మేనేజర్ హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఖాతాదారుల సంక్షేమం కోసం బ్యాంక్ ఆధ్వర్యంలో అనేక పథకాలను అమలు చేయడం జరుగుతుందని, అన్ని రకాల రుణాలను ఇవ్వడం జరుగుతుందని, ఖాతాదారులు బ్యాంకు అమలు చేస్తున్న పథకాలను ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖాతాదారులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, కళాకారులు పాల్గొన్నారు.

Leave a Reply