ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ఘన నివాళులు..

రుద్రూర్, ఆంధ్రప్రభ ; తన మతాన్ని కాపాడుకుంటూ, పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌకిక పాలకుడు, దిశాలి, రాజనీతిజ్ఞుడు, ప్రతిష్ట మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ భారత చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన యోధుడు, హిందూ సామ్రాట్ యోధుడు, భరతమాత ముద్దుబిడ్డ, శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండ పార్టీలకు అతితంగా యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు పాదయాత్ర తో చత్రపతి శివాజీ మహారాజ్ నినాదాలు చేసుకుంటూ బస్టాండ్ ప్రాంగణం వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ. తల్లి జిజియాబాయి గొప్ప దైవ భక్తురాలు.. వీరనారి శివాజీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర ఎంతో కీలకమైంది అన్నారు. రామాయణ, మహాభారత గాధలను వినిపిస్తూ శివాజీలో తల్లి జిజియాబాయి ధైర్యాన్ని, ధర్మాన్ని పెంపొందించారన్నారు. చిన్నతనం నుండే శివాజీకి పరాయి పాలనపట్ల వ్యతిరేకత ఉండేదని, పదహారేళ్ళ వయసులోని ఆయన తన స్నేహితులతో కలిసి తోరణకోటను జయించి స్వరాజ స్థాపనకు పునాది వేశారు. శత్రువుల గుండెల్లో శివాజీ నిద్రపోయేవాడు అని తెలిపారు.
హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని తన రాజ్యంలో ఆడవాళ్లు అందరినీ, తన శత్రురాజ్యం తన తోబుట్టువులుగా భావించి పసుపు కుంకుమ చీరలు ఇచ్చేవారని అలాంటి దీరుడు భరత్ ఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలన్నారు. దేశంలో అత్యధిక విగ్రహాలు కలిగిన మారాజు శివాజీ ఒకరేనని తెలియజేశారు. ర్యాలీలో పాల్గొన్న యువకులు శివాజీ మహారాజ్ వీరోచిత గాధలను స్మరించుకుంటూ ఆయన దేశభక్తి, ధైరసాహసాలు, పరిపాలన ప్రతిభ గురించి నినాదాలు చేశారు.
శివాజీ మహారాజ్ ఆదర్శాలను అనుసరించాలని, సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, నాయకులు తోట సంగయ్య, పత్తి రాము, బిజెపి మండల అధ్యక్షుడు అలపాటి హరికృష్ణ, కటికే రామ్ రాజ్, వేముల గజేందర్, శంకర్ పటేల్, దౌడు సాయిలు, మోత్కూరి నారాయణ,సాకలి సాయిలు,విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ నాయకులు ప్రశాంత్ గౌడ్, పార్వతి మురళి, కమ్మరి గణేష్, వడ్ల నరేష్, సాయినాథ్,హనుమాన్ స్వాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,
