Elections | ఓటు హక్కు వినియోగించుకున్న వెంకన్న

Elections | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 1వ వార్డు నుండి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పల్లెర్ల వెంకన్న బుధవారం జరిగిన ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మోత్కూర్ లోని జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో 1వ వార్డులో తన ఓటును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ప్రజలు తమ విలువైన ఓటును సద్వినియోగం చేసుకొని.. సరైన వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
