Nirmal | పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ…

Nirmal | పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ…
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు
ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలు ఉపేందర్ రెడ్డి పర్యవేక్షణలు
Nirmal | ఖానాపూర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా సాగేందుకు బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగే పోలింగ్ కేంద్రాల వద్ద జిల్లా ఎస్పీ జానకి షర్మిల చేరుకొని అక్కడి కేంద్రాలలో నిర్వహించిన సదుపాయాలను పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఉండేలా పోలీస్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతుందని ఆమె అన్నారు వారి వెంట ఏ ఎస్ పి సీఐలు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
