Marriguda | కోడాల బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదానం

Marriguda | మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కొండూరు గ్రామంలో జరుగుతున్న హజ్రత్ సయ్యద్ సలీం సలార్ జంగ్ బాబా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలకు వస్తున్నటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకొని గత ఏడు సంవత్సరాలుగా మండల పరిధిలోని రాజపేటతండా గ్రామానికి చెందిన కొడాల బ్రదర్స్ అయినటువంటి స్థానిక సర్పంచ్ కొడాల వెంకట్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొడాల అల్వాల్ రెడ్డిలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిధులుగా హాజరై టెంకాయ కొట్టి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉర్సు నిర్వాహకులు మాట్లాడుతూ ఏడు సంవత్సరాల క్రితం ఉర్సు ఉత్సవాల గురించి తెలియజేసిన వెంటనే నాటి నుండి నేటి వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కొడాల బ్రదర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీతారాo నాయక్, ఖదీర్ సాలార్, బాయికాడి కొండల్, జాల వెంకటయ్య, సీత యాదయ్య, సుంకరి మల్లేష్, శివకుమార్, మహేష్, పాల్గొన్నారు.
