నిధులు ఇచ్చింది మోదీ…. తెచ్చింది బండి

చొప్పదండి, ఆంధ్రప్రభ ; కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు మున్సిపాలిటీల అభివ్రుద్ధికి నిధులిచ్చింది కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమైతే ఆ నిధులు తీసుకొచ్చి తాము అభివ్రుద్ధి చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలియజేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా చొప్పదండి లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ నిధులు ఇచ్చింది బిజెపి అయితే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.6 గ్యారంటీలను అమలు చేయలేదు. ఎన్నికలొస్తున్నాయని తెలిసి కూడా నిధులు విడుదల చేయలేదన్నారు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ స్థలాతోపాటు ప్రజల జాగాలను కబ్జా చేసి అరాచకాలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. మాయమాటలు నమ్మి మోసపోవద్దని, ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే కరీంనగర్ కార్పొరేషన్, చొప్పదండిసహా మున్సిపాలిటీలను అభివ్రుద్ది చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. చొప్పదండికి అమ్రుత్ 2 ద్వారా రూ.36 కోట్ల 30 లక్షలు, 14, 15వ ఆర్ధిక సంఘం ద్వారా రూ.5 కోట్ల 57 లక్షలు స్వచ్ఛ భారత్ ద్వారా రూ.42 లక్షల 66 వేలు కేంద్రం ఇచ్చిందన్నారు. స్వనిధి ద్వారా 1611 మందికి రూ.2 కోట్ల 94 లక్షల లబ్ది పొందారన్నారు.

కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యాలి

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని అమలు చేయనికాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా. మహిళలకు నెలనెలా రూ.2500లు ఇచ్చారా. తులం బంగారం, స్కూటీ ఇచ్చారా. అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా. నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి ఇచ్చారా,2 లక్షల ఉద్యోగాలిచ్చారా, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇచ్చారా. ఉద్యోగులకు జీతాలు, డీఏలు, ఈపీఎఫ్ బకాయిలు, , రిటైర్డ్ ఉద్యోగులకు బెన్ ఫిట్స్, పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు.

Leave a Reply