Padana | బహిరంగ క్షమాపణ చెప్పాలి

Padana | పెడన – ఆంధ్రప్రభ : సీఎం చంద్రబాబు నాయుడుని అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు డిమాండ్ చేశారు. ఈ రోజు పెడన బస్టాండ్ సెంటర్ లో అంబటి రాంబాబు తీరును నిరసన తెలియజేస్తూ అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు సతీమణిని నిండు అసెంబ్లీలో దూషించి వైసీపీ నేతలు పాపం మూటకట్టుకున్నారని విమర్శించారు.
ఇప్పుడు సీఎం చంద్రబాబును దూషిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, మరింత బుద్ధి చెబుతారని వేణుగోపాలరావు అన్నారు. అంబటి భేషరతుగా క్షమాపణ చెప్పాలని, చట్టపరమైన చర్యలకు ఆయన సిద్ధంగా ఉండాలని అన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాల వల్ల ప్రజలు ఆ పార్టీని సమాధి చేయడం ఖాయమని అన్నారు. సీఎం చంద్రబాబుపై పరుష పదజాలం వాడిన అంబటి రాంబాబు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, బాజిద్ బెగ్, గఫార్, కమ్మగంటి వెంకటేశ్వరావు వాహబ్ ఖాన్, బెజవాడ నాగరాజు, అనుముల పూర్ణచంద్రరావు కూర్మ శివానంద్, వీణం శ్రీనివాస్, పరసా సూర్యనారాయణ , ఖుర్షీద్ బేగం వెలికట్ల ప్రసాద్ కర్ణ మోహన, తమ్మా భీమయ్య, సేనాపతి అజయ్, పరసా జితేంద్ర యర్రపోతు నాగేశ్వరావు, వాసా సాంబశివరావు వంకా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
