development | ప్రజల సమస్యలు పరిష్కరిస్తా..

development | ప్రజల సమస్యలు పరిష్కరిస్తా..

development | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ నూతన కమిషనర్‌గా సంపత్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ములుగు మున్సిపాలిటీ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, స్థానిక పురపాలక కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన తన్నీరు రమేష్ ములుగుకు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో సంపత్ నియమితులయ్యారు.

బాధ్యతలు చేపట్టిన అనంతరం నూతన కమిషనర్ సంపత్ మాట్లాడుతూ.. బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. బెల్లంపల్లి మున్సిపల్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి పౌర సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బందితో కలిసి సమన్వయంతో పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సంపత్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మున్సిపల్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply