Haryana | కాలువలో పడ్డ వాహనం – తొమ్మిది మంది దుర్మరణం

హర్యానాలోని ఫతేహాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనం కాలువలోకి దూసుకెళ్లడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఉన్నారు.ఇద్దరిని రక్షించగా.. మరో ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఫతేహాబాద్ జిల్లాలోని మెహమరా గ్రామానికి చెందిన 14 మంది.. పంజాబ్ రాష్ట్రంలోని ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం సర్దారేవాలా గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి భాక్రా కాలువలో దూసుకెళ్లింది. దట్టమైన పొగమంచు ఉండటం, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. తొమ్మిది మృతి చెందగా.. ఇద్దరిని రెస్క్యూ టీంలు కాపాడాయి. మరో ముగ్గురి కోసం సహాయక బృుందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. పలువురి మృతదేహాలు సుమారు 50 కి.మీ దూరంలో లభ్యం కావడం గమనార్హం. గల్లంతైన వారి కోసం 50 మందితో సహాయక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *