Coach | గంభీరా.. నువ్వు మారవా..?

Coach | గంభీరా.. నువ్వు మారవా..?
- కోచ్ తీరుపై వెటర్న్ క్రికెటర్ రహానే ఆగ్రహం
- విపరితమైన మార్పులతో టీమిండియాకు పరాజయాలు
- ఆటగాళ్లకు భరోసా ఇవ్వాలి
Coach | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. కోచ్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే భారత్ ఓడిపోతుందని మండిపడ్డాడు. జట్టులో తరుచూ మార్పులు చేయడం సరికాదని, అలా చేస్తే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందన్నారు. అలా చేయడం ద్వారానే న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు మేనేజ్మెంట్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

”భారత్ గత 9 వన్డేల్లో ఐదు ఓడిపోయింది. అందుకు కారణం.. జట్టులో అతిగా మార్పులు చేయడం. అందుకే మేనేజ్మెంట్ నుంచి ఆటగాళ్లకు తమ స్థానాలపై భరోసా కావాలని చెబుతున్నా. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు సిద్దమవుతున్నప్పుడు మేనేజ్మెంట్ నుంచి ఆటగాళ్లకు భద్రతతో పాటు స్పష్టత అవసరం. ఒక నిర్దిష్ట ఫార్మాట్లో కొందరు ఆటగాళ్లను ఆడించాలనుకున్నప్పుడు.. ఆ విషయంలో వారికి స్పష్టత ఉండాలి. మరో ఆరు నెలల వరకు భారత్‌కు వన్డే సిరీస్ లేదు. జట్టును తిరిగి సిద్దం చేసుకోవడానికి మేనేజ్మెంట్ ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. టీ20 ప్రపంచకప్ తర్వాత కూడా ఖాళీ సమయం లభించనుంది. సరైన ఆటగాళ్లను ఎంచుకోవడంతో పాటు కాంబినేషన్‌ను కనుగోవడం, ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం కీలకం.”అని రహానే చెప్పుకొచ్చాడు.

