Farmer | ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలి..

Farmer | ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలి..

  • మండల వ్యవసాయ విస్తరణ అధికారి రేవతి

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి రేవతి ఈరోజు తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ది రైతులకు సులభంగా చేరాలంటే ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు. ఓకే ఐడితో లబ్ది నేరుగా బ్యాంకు ఖాతాలోకి చేరుతుందని, ఫార్మర్ రిజిస్ట్రీ ఐడితో స్పష్టమైన గుర్తింపు సంఖ్య రావడం వలన మోసాలు తగ్గుతాయని అన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ కోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, ఆధార్ కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ తీసుకొని దగ్గరలోని మీసేవ కేంద్రాల్లో లేదా స్థానిక ఏఈఓ దగ్గర నమోదు చేసుకోవాలని తెలిపారు.

Leave a Reply