Bantumilli | గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

Bantumilli | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఈ రోజు బంటుమిల్లి మండలం నాగేశ్వరావు పేట గ్రామంలో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండలం టిడిపి పార్టీ అధ్యక్షుడు కూనపురెడ్డి వీరబాబు, మల్లేశ్వరం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒడుగు తులసి రావు, డీసీ చైర్మన్ బొర్రా కాశీ, నాగేశ్వరావుపేట ప్రెసిడెంట్ తాతారాజ, నాగేశ్వరరావు పేట గ్రామ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
