inclusions | కాంగ్రెస్‌కు బిగ్ షాక్

inclusions | కాంగ్రెస్‌కు బిగ్ షాక్
- బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్న రాజేందర్ రెడ్డి
- హరీష్, కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా
inclusions | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికలు సమిపిస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, పోతిరెడ్డిపల్లి ఉప సర్పంచ్, సిట్టింగ్ మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో పొన్న రాజేందర్ రెడ్డి బిఆర్ఎస్‌లో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పొన్న రాజేందర్ రెడ్డితో పాటు పొన్న రామ్ రెడ్డి, కృష్ణారెడ్డి, మాణిక్ రెడ్డి, దస్తగిరి, ఇంతియాజ్, మధు, నర్సింలు, జవాన్ గిరి తదితరులు వంద మందికి పైగా యువకులు బీఆర్ఎస్‌లో చేరడం విశేషం.
పాత నేతలకు గుర్తింపు లేదు.
ఈ సందర్భంగా పార్టీ మారిన నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పాత నాయకులకు తగిన గుర్తింపు, గౌరవం లేకపోవడంతో పాటు, స్థానిక నాయకులు స్వార్థ రాజకీయాల కోసం పార్టీని వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కారణంగా బీఆర్ఎస్‌లో చేరుతున్నామని వారు తెలిపారు. అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు జరగడంతో రాజకీయ వర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికలతో సంగారెడ్డి రాజకీయాల్లో బిఆర్ఎస్ మరింత బలపడిందని నేతలు పేర్కొన్నారు.
సంగారెడ్డి గడ్డపై ఎగరేది గులాబీ జెండానే..
సంగారెడ్డి గడ్డపై ఎగరేది గులాబీ జెండానే” అనే నినాదం మరోసారి ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, టీఎన్‌జీవోస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, హక్కీమ్, సంగారెడ్డి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, చింత సాయినాథ్, మధుసూదన్ రెడ్డి, విఠల్, మనోహర్ గౌడ్, హరివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
