Awareness | ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

Awareness | ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
- ఎస్సై సీహెచ్ తిరుపతి
Awareness | భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు భీమ్‌గల్ ఎస్సై సీహెచ్ తిరుపతి ఆధ్వర్యంలో శనివారం లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందానికి ’అరైవ్- అలైవ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పొన్నం సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ కమిషనర్ సూచనలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత పై భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా ఎస్సై సిహెచ్ తిరుపతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రమాద సమయంలో ప్రాణ రక్షణకు కవచంలా పని చేస్తుందని తెలిపారు. అ జాగ్రత్త వల్ల, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు.

యువత రాష్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్ యువకులకు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. యువతీ యువకులు 18 సంవత్సరాలు పైబడిన వారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నప్పుడే వాహనాలను నడిపి ఇవ్వాలని సూచించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ అబ్దుల్ షఫీ మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకుండా బాధ్యతతో కలిగిన డ్రైవింగ్ చేస్తూ పోలీసులను సహకరిస్తూ వాహనాలను నడిపోవాలని కోరారు.
ఈ సందర్భంగా పాఠశాల బస్సు నడిపించే డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ రాధా కిషన్ నాయర్, ప్రైమరీ స్కూల్ ఇన్చార్జ్ బిన్ను, ఏవో ప్రకాష్, మహిళా ఉపాధ్యాయులు ఉపాధ్యా బృందం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
