Badminton | ప్రి క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌, ప్రణయ్ !

ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లరు కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ప్రి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ఈరోజు (బుధావారం) జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌-1, ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ 21-19, 21-14 తేడాతో జపాన్‌కు చెందిన కూ టకహాషిను వరుస గేముల్లో చిత్తు చేశాడు.

మరో మ్యాచ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21-11, 20-22, 21-9 తేడాతో జు వీ వాంగ్‌ (చైనీస్‌ తైపీ) షట్లర్‌పై విజయం సాధించి టోర్నీలో ముందంజ వేశాడు.

ఇతర మ్యాచుల్లో ఆయూష్‌ షెట్టి 21-17, 21-9తో మూడో సీడ్‌ కీన్‌ యి లోహ్‌ (సింగపూర్‌)పై నెగ్గగా.. కిరణ్‌ జార్జ్‌ ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో భారత్‌కు షాక్‌ తగిలింది. యువ షట్లర్లు మాళవిక బన్సోద్‌, ఉన్నతి హూదాలో తొలి రౌండోలోనే టోర్నీ నిష్క్రమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *