Yedapalle | గుర్తు తెలియని వాహనం ఢీకొని…

Yedapalle | గుర్తు తెలియని వాహనం ఢీకొని…
- వన్యప్రాణి మృతి…
Yedapalle | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వన్యప్రాణి నీల్ గాయ్ మృతిచెందింది. గ్రామ శివారు ప్రాంతంలో గల స్ప్రింగ్ హోటల్ సమీపంలో బోధన్ – నిజామాబాద్ ప్రధాన రహదారిని దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో నీల్ గాయ్ సమీప పంటపొలాల్లో పడింది.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు నీల్ గాయ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. రహదారి ప్రక్కనే అటవీ ప్రాంతం ఉండడంతో తరచుగా వివిధ రకాల వన్యప్రాణులు రహదారి దాటుతుంటాయి. గతంలో సైతం అడవి పందులు ఇదే తరహా రోడ్డు ప్రమాదాలలో మృతిచెందాయి.
