8people | ఇద్దరు మహిళలు మృతి

8people | ఇద్దరు మహిళలు మృతి

8people | పి.కొత్తకోట, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పి.కొత్తకోట రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొనడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వేగంగా వస్తున్న కారు రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు తెలంగాణకు చెందినవారిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply