అభివృద్ధి చేస్తా.. అవకాశం ఇవ్వండి

అభివృద్ధి చేస్తా.. అవకాశం ఇవ్వండి
- 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పుట్ట రేణుక
కల్వకుర్తి, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పుట్ట రేణుక రాజశేఖర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో భాగంగా ప్రతిరోజు వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. వార్డు ప్రజలు ఆలోచించి ఈనెల 11న జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని పుట్ట రేణుక రాజశేఖర్ ఓటర్లను కోరారు.
