5 states elections | ఆ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స‌మ‌రం

5 states elections | ఆ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స‌మ‌రం

ఇవాళ ప్ర‌క‌టించ‌నున్న భార‌త ఎన్నిక‌ల సంఘం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : దేశంలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలుకానుంది. జాతీయ రాజకీయాల్లో అసలైన సమరానికి ముహూర్తం ఖరారైంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఇవాళ (ఆదివారం) ప్రకటించనుంది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయ‌నుంది. మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నిక ల్లో వరుసగా గెలుస్తూ వస్తున్న ఎన్డీఏకు ఈ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. ఈ ఎన్నికలు 2029 ఎన్నికలు సెమీ ఫైనల్స్ గా నిలవనున్నాయి.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి, అస్సాం లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు రెండు విడతల్లో, పశ్చిమ బెంగాల్ ఆరు విడతల్లో పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ లో ఎన్డీఏ కూటమికి ఇప్పటి వరకు విజ‌యం ద‌క్క‌లేదు. ఈ మూడు రాష్ట్రాల్లో ఈ సారి బీజేపీ జెండా పాతాల‌ని కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. అందులో భాగంగా తమిళనాడులో అన్నా డీఎంకేతో జత కట్టింది. బెంగాల్ లో తాజా పరిణామలు తమకు కలిసి వస్తాయని లెక్కలు వేస్తోంది.

Leave a Reply