5 Dead Us Israel Strike : ఇక ఇరాకీ జగడం Andhra Prabha Top Story

5 Dead Us Israel Strike : ఇక ఇరాకీ జగడం Andhra Prabha Top Story
- ఐదుగురు పీఎంఎఫ్ సభ్యులు ఖతం
- 12 మందికి తీవ్రగాయాలు
- ఆయుధగారం ధ్వంసం
- అమెరికా దళాలకు..
- 24 గంటల డెడ్‌లైన్
- బాగ్దాద్‌లో నిరసనలు..
- గ్రీన్ జోన్‌లో హై అలర్ట్
- ప్రాక్సీ వార్‌గా మారుతున్న మధ్యప్రాచ్య సంక్షోభం
(ఆంధ్రప్రభ, బాగ్దాద్ ప్రతినిధి )
ఇరాకీ పారామిలిటరీ దళం పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (PMF)కి చెందిన రెండు కీలక స్థావరాలను అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి జరిగాయని ధృవీకరించింది. నినెవె గవర్నరేట్ (Nineveh Governorate) లోని PMF 25వ బ్రిగేడ్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై సోమవారం తెల్లవారుజామేన దాడి జరిగింది. సలాహ్ అల్-దిన్ గవర్నరేట్ (Salah al-Din Governorate) లెని ఉన్న 52వ బ్రిగేడ్ స్థావరం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.
5 Dead Us Israel Strike : ఏకకాలంలో.. రెండు ప్రాంతాల్లో..

ఈ రెండు స్థావరాలపై ఒకే సమయంలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఐదుగురు పీఎంఎఫ్ సభ్యులు దుర్మరణం చెందగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సీఎంఫ్ ఆయుధగారాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ అనూహ్య ఘటనపై పీఎంఎఫ్ దళాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చిరిక జారీ చేశాయి. ఇక ఇరాన్ ప్రభుత్వ కూడా సీరియస్ అయింది. తక్షణమే అమెరికా దళాలు ఖాళీ చేయాలని 24 గంటల డెడ్ లైన్ విధించాయి. .

హోర్ముజ్ జలసంధిని తెరవాలనే అమెరికా గడువు సమీపిస్తున్న తరుణంలో, ఇరాన్ అనుకూల గ్రూపులను బలహీనపరిచేందుకు అమెరికా-ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాక్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న మరికొన్ని సాయుధ బృందాలు కూడా గత 24 గంటల్లో అమెరికా స్థావరాలపై ద్రోన్లు క్షిపణులతో దాడులు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఇక ఇరాకీ పారామిలిటరీ (PMF) స్థావరాలపై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాక్‌లో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి.
5 Dead Us Israel Strike : పైన్యం అప్రమత్తం

తమ సైన్యం. వాయుసేనను ఇరాక్ ప్రభుత్వం హై -అలర్ట్‌లో ఉంచారు. విదేశీ రాయబార కార్యాలయా ‘గ్రీన్ జోన్’ వద్ద భద్రతను భారీగా పెంచారు. దాడులకు గురైన 25 , 52వ బ్రిగేడ్లు ప్రతికారం తీర్చుకుంటామని ప్రకటించాయి: ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలు ఐన్ అల్-అసద్ (Ain al-Asad) ఎర్బిల్‌లోని హరీర్ బేస్‌లపై డ్రోన్ దాడులు చేస్తామని హెచ్చరించాయి. అమెరికాకు వ్యతిరేకంగా బాగ్దాద్ వీధుల్లో PMF మద్దతుదారులు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
5 Dead Us Israel Strike : అమెరికా ప్రతీకారం

అమెరికా స్థావరాలపై దాడులకు ప్రతీకారం (Retaliation) గత కొన్ని రోజులుగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలైన ఐన్ అల్-అసద్ (Ain al-Asad) మరియు హరీర్ (Harir) బేస్‌లపై ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ సాయుధ గ్రూపులు (PMF) డ్రోన్లు మరియు క్షిపణులతో దాడులు చేస్తున్నాయి. ఈ దాడులకు సమాధానంగానే అమెరికా నేరుగా PMF స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. మార్చి 28న కూడా అమెరికా దాడిలో ముగ్గురు పీఎంఎఫ్ సభ్యులు, ఇద్దరు పౌరులు మరణించారు.
5 Dead Us Israel Strike : ప్రాక్సీ’ నెట్‌వర్క్ లక్ష్యం
ఇరాన్ తన సొంత భూభాగం నుంచి కాకుండా, ఇరాక్‌లోని ఈ పారామిలిటరీ గ్రూపుల ద్వారా ఇజ్రాయెల్, అమెరికాపై దాడులు చేయిస్తోంది. ఇరాన్ నేరుగా యుద్ధంలోకి దిగకుండా ఈ గ్రూపులను వాడుకుంటోంది. ఈ గ్రూపుల ఆయుధ గిడ్డంగులు, ఇంటెలిజెన్స్ కేంద్రాలను ధ్వంసం చేయడంతో ఇరాన్ శక్తిని తగ్గించాలని అమెరికా-ఇజ్రాయెల్ భావిస్తున్నాయి.
5 Dead Us Israel Strike : ఇరాక్ సర్కారు సీరియస్

ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్-సుడానీ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు అత్యవసర భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు: తమ దేశ భూభాగంపై జరిగిన ఈ దాడులను ఇరాక్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా ప్రభుత్వం అభివర్ణించింది. ఈ దాడులపై విచారణ ఇవ్వాలని కోరుతూ బాగ్దాద్‌లోని అమెరికా రాయబారికి ఇరాక్ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.
5 Dead Us Israel Strike : తక్షణం ఖాళీ తాకీదు

ఇరాక్ భూభాగాన్ని ఇతర దేశాల యుద్ధ క్షేత్రంగా మార్చడాన్ని అంగీకరించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాక్ నుంచి అమెరికా సైన్యాన్ని పంపించివేయాలనే చర్చలు ఇప్పటికే కీలక దశకు చేరుకున్నాయి: జనవరి 18, 2026న ఇరాక్ ప్రభుత్వం తన సమాఖ్య భూభాగం నుంచి అమెరికా దళాల పూర్తి ఉపసంహరణ పూర్తయిందని ప్రకటించింది. అమెరికా సైన్యానికి అత్యంత కీలక ఐన్ అల్-అసద్ (Ain al-Asad) వైమానిక స్థావరం నుంచి అమెరికా సైనికులు పూర్తిగా నిష్క్రమించారు. ప్రస్తుతం ఈ స్థావరం ఇరాక్ సైన్యం ఆధీనంలో ఉంది.. ప్రస్తుతం ఈ స్థావరం ఇరాక్ సైన్యం ఆధీనంలో ఉంది. ఇరాక్‌లోని సెమీ-అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతంలో (ముఖ్యంగా ఎర్బిల్‌లోని హరీర్ బేస్) ఇప్పటికీ కొంతమంది అమెరికా సైనికులు ,సలహాదారులు ఉన్నారు. వీరు 2026 చివరి నాటికి పూర్తిగా వెళ్ళిపోతారని అంచనా.
5 Dead Us Israel Strike : 24 గంటల డెడ్ లైన్

ఇరాకీ సాయుధ గ్రూపులు బాగ్దాద్‌లోని ‘విక్టోరియా బేస్ కాంప్లెక్స్’ నుంచి అమెరికా NATO దళాలు వెళ్ళిపోవడానికి 24 గంటల గడువు విధించాయి. భద్రతా హెచ్చరిక: బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులను వెంటనే ఇరాక్ విడిచి వెళ్లాలని హెచ్చరించింది.
