45crore Release : అన్ని మతాలను గౌరవిస్తా Andhra Prabha News

45crore Release : అన్ని మతాలను గౌరవిస్తా Andhra Prabha News
- అందరివాడిలా ఉంటా.
- పేదల కోసమే పీ4 తీసుకొచ్చాం.
- ఎక్కడ పేదవాడు ఉంటే
- అక్కడ నేను ఉంటా
- అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తాం
- వక్ఫ్ ఆస్తులను కాపాడుతాం
- గౌరవవేతనం బకాయిలు విడుదల చేస్తాం
- 21 నెలల్లో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు
- విజయవాడ ఇఫ్తార్ విందులో ఏపీ సీఎం
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్)

అన్ని మతాలను గౌరవిస్తా… అందరివాడిలా ఉంటా. పేదలను ఆదుకునేందుకు పీ4 తీసుకొచ్చాం. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటా’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇమామ్, మౌజన్‌లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నూతనంగా హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 21 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు అందించిందని వివరించారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాం. రంజాన్ పండుగ సందర్భంగా పేదలకు దానం చేస్తే సంతోషంగా ఉంటారని మహ్మద్ ప్రవక్త బోధించారు. పేదలకు సాయం చేయడమే ఖురాన్ ప్రవచించిన సూక్తి అని సీఎం వివరించారు.
45crore Release : ముస్లింల సంక్షేమమే లక్ష్యం

ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తేవటమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ముస్లింలలో 4.38 లక్షల మందికి ఇస్తూ ఏడాదికి రూ.3,511 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 4.5 లక్షల మంది ముస్లిం విద్యార్దులకు తల్లికి వందనం ఇస్తున్నాం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు 19,215 మందికి రూ.264 కోట్లు విడుదల చేశాం. దీపం-2.0 పథకం కింద 6.20 లక్షల కుటుంబాలకు రూ.158 కోట్లతో సిలిండర్లకు ఖర్చు చేస్తున్నాం. ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజన్లకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనంగా రూ.180 కోట్లు అందించాం. మరో రూ.45 కోట్ల బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించాను.”అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
45crore Release : ముస్లింల మనోభావాలను గౌరవిస్తాం

“అర్హత కలిగిన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తున్నాం. వివాహ లైసెన్స్ గడువు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచాం. 347 మంది ముస్లింలు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నాం. 33,275 మందికి ఆర్ధిక చేయూత కింద రూ.193 కోట్లు ఇచ్చాం. యువతకు నైపుణ్యాలు అందించి మెరుగైన ఉపాధి ఉద్యోగాలు దక్కేలా చేస్తున్నాం అని సీఎం స్పష్టం చేశారు.
45crore Release : వక్ఫ్ బోర్డును వివాదాల్లోకి నెట్టారు

గత పాలకులు జీవో 47 ద్వారా వక్ఫ్ బోర్డును వివాదాల్లోకి నెట్టారు. ఆ జీవోను రద్దు చేసి వక్ఫ్ బోర్డును పునర్వవ్యస్తీకరణ చేశాం. 1500 వక్ఫ్ ఆస్తులను సర్వే చేశాం. వక్ఫ్ ఆస్తులను కాపాడుతున్నాం. నూర్ బాషా ఫెడరేషన్ పేరును దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పోరేషనుగా మార్పు చేసి రూ.100 కోట్లు కేటాయించాం. గత బడ్జెట్లో మైనారిటీలకు రూ.5,434 కోట్లు కేటాయిస్తే… ఈసారి రూ.6,090 కోట్లు కేటాయించాం. ఉర్దూ అకాడమీకి గత పాలకులు రూ.1 లక్ష మాత్రమే ఇచ్చింది. కూటమి ప్రభుత్వంలో రూ.7 కోట్లు మంజూరు చేశాం. అబ్దుల్ హక్ అవార్డు కింద రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఉర్దూ ఘర్, షాధీ ఖానాల నిర్మాణానికి రూ.2.85 కోట్లు కేటాయించాం. ముస్లిం జీవన ప్రమాణాలు పెంచేలా చేస్తున్నాం. ఈ విందులో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు నజీర్, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, పలువురు ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు.
ALSO READ : LPG black market control AP : బ్లాక్ చేస్తే సహించం
