- కాలం దాటిన బస్సులను పక్కన పెట్టనున్న ఆర్టీసీ
- ప్రయాణికులకు తగినట్లు బస్సు సర్వీసులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రయాణికులకు సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కాలం చెల్లిన బస్సులను పక్కన పెడుతూ 422 కొత్త బస్సుల (422 new buses) ను అందుబాటులో తీసుకు రానుంది. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) అమలుతో బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరగడంతో ప్రయాణికులు (Passengers) ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీని దృష్ట్యా ఆక్యూపెన్సీకి అనుగుణంగా బస్సులు నడపాలని ఆ సంస్థ నిర్ణయించింది.
15 ఏళ్లు దాటిన బస్సులకు స్వస్తి..
తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) లో 15 ఏళ్లు దాటిన, 15 లక్షల కిలోమీటర్లు తిరిగినా బస్సులను పక్కన పెట్టడానికి ఆర్టీసీ నిర్ణయించిందని తెలిసింది. ఇప్పటికే కాలంచెల్లిన 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్‌లను, 17 ఎక్స్‌ప్రెస్ లు, 22 డీలక్స్‌ల స్థానంలో కొత్త బస్సులను రోడ్లపైకి రానున్నాయి.