40 Dead Iran Us Israel War : అడ్వాన్స్​ వార్​ Andhra prabha News

40 Dead Iran Us Israel War : అడ్వాన్స్​ వార్​ Andhra prabha News

  • ఇరాన్​ లో 34 మంది మృతి
  • 8 వంతెనలు కూల్చివేత
  • విమానాశ్రయాలు ధ్వంసం
  • రైల్వే లైన్లపైనా దాడి
  • ఇరానూ తగ్గలే
  • అమెరికా సైనిక స్థావరాలపై దాడులు
  • ఇజ్రాయెల్​ లో మంటలు
  • ఇక యుద్ధం తారాస్థాయికి చేరినట్టే

( ఆంధ్రప్రభ, టెహ్రాన్​ ప్రతినిధి)

40 Dead Iran Us Israel War

ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. ఇరాన్​ పై అమెరికా ఇజ్రాయెల్​ దాడుల్లో 34 మంది ఇరానీయులు మృతి చెందారు. ఇరాన్​ జరిపిన దాడిలో ఆరుగురు మృతి చెందారు. 15 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు విధించిన డెడ్​ లైన్​ ముందే యుద్ధం ప్రారంభమైంది. కొన్ని గంటల్లో ఇరాన్​ నాశనమౌతోందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తరువాత అనధికార యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్​ లో కీలక ఖార్గద్వీపంపై దాడి జరిగింది. విమానాశ్రయాలు, 8 వంతెనలపై ఇజ్రాయెల్​ దాడి చేసింది.

40 Dead Iran Us Israel War : ఇరాన్​ లో 34 మంది మృతి

40 Dead Iran Us Israel War

అల్బోర్స్ ప్రావిన్స్ లో జనవాసాలపై జరిగిన దాడుల్లో 18 మంది మరణించారు, వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. టెహ్రాన్ షహ్రియార్ సిటీలో జనవాసాలపై జరిగిన దాడుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కాశాన్ యహ్యా అబాద్ రైల్వే వంతెనను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. యుద్ధం ఆరంభం నుంచి టివరకు ఇరాన్‌లో 3,540 మంది మృథి చెందినట్టు మానవ హక్కుల సంస్థ HRANA తెలిపింది.ఇరాన్ మౌలిక సదుపాయాలు వ్యూహాత్మక కేంద్రాలను అమెరికా, ఇజ్రాయోల్​ దళాలు టార్గెట్​ చేశాయి. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్, బహ్రామ్, అజ్మయేష్ ఉర్మియా, ఖోయ్ , కాషాన్ విమానాశ్రయాలపై దాడులు జరిగాయి.
ఇరాన్ వ్యాప్తంగా 8 వంతెనలను ఇజ్రాయెల్​ ధ్వంసం చేసింది. ఇవి ప్రధానంగా టెహ్రాన్, కరాజ్, తబ్రిజ్, కాషాన్, క్యూమ్ ప్రాంతాలలో ఉన్నాయి. ఇరాన్ వ్యూహాత్మక చమురు ఎగుమతి కేంద్రం ఖార్గ్ ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై అమెరికా దాడులు నిర్వహించింది. టెహ్రాన్‌లోని షరీఫ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సమీపంలోని ఇంధన కేంద్రం, మసీదుపై దాడులు జరిగి నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో, తన పౌరులను రైలు ప్రయాణాలు చేయవద్దని కీలక ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని తమ పౌరులను ఇరాన్​ హెచ్చరించింది

40 Dead Iran Us Israel War : హైఫా​ లో నలుగురు మృతి

40 Dead Iran Us Israel War

ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్​ వైమానిక దాడులతో ఇరాన్​ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. ఇరాన్​ కూడా ఎక్కడ తగ్గలేదు. అమెరికా సైనిక స్థావరాలు ఇజ్రాయెల్ లక్ష్యంగా ఈ దాడులు జరిపింది. ఇరాన్ తన అత్యంత శక్తివంత బాలిస్టిక్ క్షిపణులను టెల్ అవీవ్, హైఫా, నీటివ్ హసర, ఏలాట్ నగరాలపై ప్రయోగించింది. ముఖ్యంగా క్లస్టర్ బాంబులను జనవాసాలపై ప్రయోగించింది. కువైట్ అలీ అల్ సేలం (Ali Al Salem)లోని అమెరికా ఎయిర్ బేస్ ప్రధాన లక్ష్యంగా మారింది. డ్రోన్ దాడుల వల్ల కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులు దగ్ధమయ్యాయి. నీటి శుద్ధి ప్లాంట్లు దెబ్బతిన్నాయి.
అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ (5th Fleet) ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. రాజధాని మనామా ముహర్రక్ నగరాల్లోని భవనాలు దెబ్బతిన్నాయి. రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, రాస్ తనూరా చమురు శుద్ధి కర్మాగారంపై దాడులు జరిగాయి. అబుదాబిలోని అల్ దఫ్రా (Al Dhafra) ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. డ్రోన్ శకలాలు పడటం వల్ల దుబాయ్‌లోని ప్రసిద్ధ బుర్జ్ అల్ అరబ్ హోటల్, జెబెల్ అలీ పోర్ట్ దెబ్బతిన్నాయి. అమెరికా దళాలు ఉండే అల్ ఉదీద్ (Al Udeid) బేస్‌పై క్షిపణులు డ్రోన్లను ఇరాన్​ ప్రయోగించింది. జోర్డాన్, ఇరాక్ (ఎర్బిల్), ఓమన్ (దక్మ్ పోర్ట్), మరియు సైప్రస్ లోని బ్రిటీష్ సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు నిర్వహించింది.

ALSO READ : Iran Rejects : రెడ్​ లైన్​ దాటొద్దు Andhra Prabha News

Leave a Reply