ప్రజలందరికి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు..

ప్రజలందరికి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు..
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : పెనుగంచిప్రోలు జేజి యం పార్థన మందిరం లో పాస్టర్ యం జోసప్ పాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పార్థనలు ఆదివారం తెల్లవారు జామున నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఈ ఈస్టర్ పర్వదినం గురించి క్లుప్తంగా పాస్టర్ జోసప్పాల్ చేపిన మాటలు ఇవి ఈస్టర్ పండుగ క్రైస్తవులలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక పండుగగా భావించబడుతుంది.యేసుక్రీస్తు శిలువపై మరణించిన తర్వాత మూడవ రోజు తిరిగి బ్రతికి లేచిన సంఘటనను స్మరించుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు.ఇది సాధారణంగా మార్చి చివరి లేదా ఏప్రిల్ నెలలో వచ్చే ఆదివారం రోజున జరుగుతుంది.ఈస్టర్‌కు ముందు వచ్చే 40 రోజుల కాలాన్ని “లెంట్” అంటారు.
ఈ సమయంలో భక్తులు ఉపవాసం, ప్రార్థనలు చేసి ఆత్మశుద్ధికి ప్రాధాన్యత ఇస్తారు. ఈస్టర్‌కు ముందు “గుడ్ ఫ్రైడే” (శిలువ వేయబడిన రోజు) ప్రత్యేకంగా గుర్తిస్తారు. ఈస్టర్ రోజున చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. యేసు ప్రభువు పునరుత్థానం ఆనందాన్ని సూచిస్తూ భక్తులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఈ రోజు “కొత్త జీవితం, ఆశ, విజయం” అనే భావాలను తెలియజేస్తుంది. ఇంకా, ఈస్టర్ కొత్త జీవితానికి సంకేతంగా భావిస్తారు.
పిల్లలు పెద్దలు అందరూ కలిసి సందడిగా పండుగ జరుపుకుంటారు, కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేయడం వంటి ఆనందకర కార్యక్రమాలు కూడాజరుగుకుంటారు,సంక్షిప్తంగా ఈస్టర్ పండుగ మనిషికి ఆశ, విశ్వాసం, మరియు కొత్త జీవి తం ప్రారంభానికి ప్రతీకగా నిలుస్తుంది. అన్ని ఈ పండుగను అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవాలని జెజియం మందిరం పాస్టర్ యం. జోసప్ పాల్ తెలిపారు..
