4 Us Aircrafts Destroyed : పెంట‌గాన్ గూబ గుయ్ Andhra Prabha News

4 Us Aircrafts Destroyed : పెంట‌గాన్ గూబ గుయ్ Andhra Prabha News

  • కోహ్గిలుయే రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
  • పైల‌ట్ సుర‌క్షితం
  • అమెరికా హ్యాపీ
  • 2 విమానాలు మాటాష్
  • 2 బ్లాక్ హాక్స్ ధ్వంసం
  • ఇటు ఇరాన్ సంబ‌రం
  • మేమే ధ్వంసం చేశాం .. అమెరికా వాదన
  • సాంకేతిక లోపాలా?
  • యుద్ధం దెబ్బా? అనుమానాలు

( ఆంధ్ర‌ప్ర‌భ‌, టెహ్రాన్ ప్ర‌తినిధి)

4 Us Aircrafts Destroyed

ఇరాన్ లోని కోహ్గిలుయే, బోయెర్-అహ్మద్ (Kohgiluyeh and Boyer-Ahmad) ప్రావిన్స్‌లోని కఠిన పర్వత ప్రాంతంలో కూలిన అమెరికా F-15E స్ట్ర‌యిక్ ఈగిల్ యుద్ధ విమానం ఫైల‌ట్ కోసం తాము చేప‌ట్టిన రెస్య్కూ ఆప‌రేష‌ప్ స‌క్కెస్ కావ‌టంతో పెంట‌గాన్ అధికారులు సంబ‌రం చేస్తున్న త‌రుణంలో.. ఇరాన్ మ‌రో చావు దెబ్బ క‌బురు చెప్పింది.

4 Us Aircrafts Destroyed : 2 విమానాలు మాటాష్

4 Us Aircrafts Destroyed : 2 బ్లాక్ హాక్స్ ధ్వంసం

4 Us Aircrafts Destroyed

రెండు సీ-130 (C-130) రవాణా విమానాలు, రెండు బ్లాక్ హాక్ (Black Hawk) హెలికాప్టర్ల‌ను కూల్చిన‌ట్టు ఇరాన్ ప్ర‌క‌టిచింది. దక్షిణ ఇస్ఫాహాన్ (Southern Isfahan) ప్రావిన్స్‌లో వీటిని ధ్వంసం చేసిన‌ట్టు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ విమానాలు ఇస్ఫాహాన్ నగరం నుంచి ఆగ్నేయం దిశ‌లో (Southeast of Isfahan City) 50 కిలోమీటర్ల దూరంలోని ఒక పాత విమానాశ్రయం ప్రాంతంలో ధ్వంసం చేసిన‌ట్టు ఇరాన్ సైన్యం వివ‌రించింది. తమ వైమానిక దళం (IRGC Aerospace), , పదాతి దళం స‌హా స్థానిక గిరిజన యోధులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫాఘరి తెలిపారు.

4 Us Aircrafts Destroyed : అబ్బే మేమే కూల్చాం

4 Us Aircrafts Destroyed

రెస్క్యూ ఆప‌రేష‌న్ ఉపయోగించిన ఈ విమానాలు సాంకేతిక లోపాలు లేదా ప్రతికూల వాతావరణంతో ఆ ప్రాంతంలో చిక్కుకుపోయాయని, అవి ఇరాన్ దళాల చేతికి చిక్కకుండా త‌మ దళాలే స్వయంగా ధ్వంసం చేసి (Controlled Destruction) వెనుదిరిగాయ‌ని అమెరికా చెప్పిన‌ట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్ల‌డి చేశాయి. శ‌నివారం కూలిన అమెరికా ఎఫ్-15ఈ (F-15E) ఫైటర్ జెట్‌కు చెందిన పైలట్ కోసం అమెరికా ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టింది. ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పైలట్ ను సురక్షితంగా రక్షించామ‌ని, ఇది గొప్ప విజ‌యం అని సోష‌ల్ మీడియాలో ప్రకటించగా, ఇరాన్ మాత్రం ఇది అమెరికాకు ఒక పెద్ద ఓటమి అని వాదిస్తోంది.

ALSO READ : Us Pilot Rescued : అమెరికా ఫైల‌ట్ సేఫ్ Andhra Prabha News

Leave a Reply