3rdMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

3rdMarchCartoon|దౌత్య మార్గాలంటూనే దాడి ధోరణి
3rdMarchCartoon|నోబెల్ శాంతి మాటల్లో… యుద్ధ హెచ్చరికల్లో తీవ్రత
ఇరాన్‌పై బాంబుల వర్షం – “ఇది శాంపిల్ మాత్రమే” అన్న ట్రంప్
దౌత్య మార్గాలంటూనే దాడి ధోరణి – ప్రపంచం గందరగోళంలో
ప్రపంచానికా హెచ్చరిక? లేక ఇరాన్కేనా సందేశం?
ద్వంద్వ వైఖరిని వ్యంగ్యంగా చిత్రించిన కార్టూన్
రెండు దశాబ్దాలుగా పాఠకులను అలరిస్తున్న ‘ఔరా’ కార్టూన్ శీర్షిక

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ద్వంద్వ వైఖరికి మారుపేరు మన ట్రంపు గారు.
అటు నోబెల్ శాంతి బహుమతి కావాలంటూనే అదే శాంతి బహుమతి పొందడానికి ఎంతటి అశాంతినైనా సృష్టిస్తారు. దౌత్యమంటూనూ కయ్యానికి కాలుదువ్వుతారు.
స్నేహమంటూనే సుంకాలతో విరుచుకు పడతారు.
అమెరికన్స్ ఫస్ట్ అంటూనే అమెరికన్ల అవకాశాలను దెబ్బదీస్తుంటారు..
వారికి అదో తుత్తి.
పెద్దన్న పాత్ర సంగతేమో గానీ భయపెట్టడానికి మాత్రం తీవ్రంగా కృషి చేస్తుంటారు.
ప్రస్తుతం ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఇది ఇంకా శాంపిల్ మాత్రమేనంటున్నారు.
అంటే అసలు యుద్ధం ఇది కాదా?
ఇంకా మోతెక్కించనున్నారా?
ఈ హెచ్చరికలు ఇరాన్ కా? ప్రపంచానికా?
ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూనే, మరోపక్క ఇప్పటికీ మా దౌత్య మార్గాలు తెరిచే ఉన్నాయని సెలవిస్తున్నారు.
ఈ ద్వంద్వ వఖరిని వ్యంగ్యంగా చూపించిన ఆంధ్రప్రభ కార్టూన్ ఇది.
గత రెండు దశాబ్ధాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.
click here for more oura
