ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ…

ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేత
సమస్యలు తెలుసుకున్న నాయకులు

పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడలోని 30వ డివిజన్ మద్దికట్ట విజయదుర్గానగర్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమ మహేశ్వరరావు ఆదేశాల మేరకు డివిజన్ నాయకులు, ఎన్డీఏ కూటమి ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి అవ్వాతాతలు, వికలాంగులకు పెన్షన్ నగదును అందజేశారు.
క్లస్టర్ ఇంచార్జ్ ఘంటా కృష్ణమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు.

లబ్ధిదారులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జరుగుతోందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్వయంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారని పేర్కొన్నారు. బొండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.

రహదారుల అభివృద్ధి, కాలువల శుభ్రత, తాగునీటి సమస్యల పరిష్కారం, విద్యా సంస్థల మెరుగుదల, దేవాలయాల పునర్నిర్మాణం, పేదలకు గృహ సదుపాయాలు వంటి కార్యక్రమాలు వేగంగా అమలు అవుతున్నాయని వివరించారు. ప్రతి నెల నిర్వహించే ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడం ఎమ్మెల్యే ప్రత్యేకతగా నిలుస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమలను ప్రోత్సహిస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని, “సూపర్ సిక్స్” హామీల అమలు ద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని తెలిపారు.

వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచిన పెన్షన్లు, మహిళలకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు ప్రోత్సాహక పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని చెప్పారు. అధికారం ప్రజల పట్ల బాధ్యతగా భావించి పనిచేస్తున్న నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు అని పేర్కొంటూ, సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపడం ఆయన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లక్కం రాజు శ్రీనివాసరాజు, కర్ణం వెంకటరమణ, చౌదరి సూర్యనారాయణ, వీరబద్ర, మురళి, రెడ్డి శెంకర్, సత్తివాడ రాము, సింహాచలం, సాయి, కోటేశ్వరమ్మ, కుమారి, సరోజినీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply