జనాభా లెక్కల సర్వే పక్కగా నిర్వహించాలి

జనాభా లెక్కల సర్వే పక్కగా నిర్వహించాలి
- జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్
పోలవరం (రంపచోడవరం) ఆంధ్రప్రభ ప్రతినిధి : పోలవరం జిల్లాలోని ప్రతి గ్రామంలో తప్పులు లేకుండా జనాభా లెక్కల సర్వే పక్కగా నిర్వహించాలని పోలవరం జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో 12 మండలాలకు సంబంధించిన తహసీల్దార్ల, ఎంపీడీవోల, డిజిటల్ అసిస్టెంట్ల, ఏ ఎస్ డి లతో జనాభా లెక్కలు పక్కాగా నిర్వహించే విధంగా పోలవరం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం నొక్వాల్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ ఏ. ఎస్.దినేష్ కుమార్ మాట్లాడుతూ 2027 జనాభా లెక్కల ఇంటింటి సర్వే మే నెల ఒకటో తారీకు నుండి మే నెల 31 తారీకు వరకు 30 రోజులపాటు జనాభా లెక్కల ప్రక్రియ ఫెజ్ వన్ ద్వారా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఇంటింటి జనాభా లెక్కలు డిజిటల్ చెస్ ద్వారా డేటా తీసుకోవాలని ఆయన అన్నారు.

ఇంటింటి జనాభా లెక్కల ప్రక్రియలో గ్రామ సచివాలయాలకు సంబంధించిన సిబ్బందిని ఉపయోగించాలని ఆయన అన్నారు. జనాభా లెక్కల ప్రక్రియలో డిజిటల్ అసిస్టెంట్లు విధి విధానాలపై పూర్తిగా అవగాహనతో ఉండాలని ఆయన అన్నారు. జనాభా లెక్కల ప్రక్రియలో రెవెన్యూ గ్రామాలు, ఫారెస్ట్ గ్రామాలు అదేవిధంగా సాధారణ గ్రామాలు సర్వే చేయవచ్చును లేనిది ముందుగా ఇన్యూమనేటర్లు పూర్తిస్థాయిలో అవగాహనతో ఉండాలని ఆయన అన్నారు. సిటిజన్స్ హక్కుల గురించి తెలుసుకోవాలని ఆయన అన్నారు. 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వ యాక్ట్ ద్వారా జనాభా లెక్కలు చేయవలసి ఉంటుందని ఆయన అన్నారు.
హౌస్ బ్లాక్ ఏర్పాటు చేసుకొని ఇంజ్యుమునేటర్లకు కేటాయించిన ఏరియాను 30 రోజులలో పూర్తిచేయాలని ఆయన అన్నారు. ఇంజ్యుమునేటర్లు 30 రోజుల్లో 700 నుండి 800 గృహాలకు సంబంధించిన జనాభా లెక్కలు పూర్తి చేయవలసి ఉంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు పి.బాలాజీ,కరక సత్యనారాయణ, సిహెచ్ శ్రీనివాసరావు, వేణుగోపాల్,ఏ సత్యనారాయణ, దొరకయ్య, జనాభా లెక్కల అధికారులు బి.త్రిమూర్తులు, అనుకుల్ కుమార్,టి.జయరాం, జగదీష్ పూరి,శివం కుమార్, ఎంపీడీవోలు ఎస్ శ్రీనివాసరావు దొర,రవి కిషోర్,సాల్మన్ రాజ్, బాపన్న దొర,యాదగిరి ఈశ్వరరావు, ఏ వి వి కుమార్ లక్ష్మణ్, తాసిల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
