3.6 Crore Ferry Auction : ఫెర్రీ రేవు వేలం వ‌ర్రీ Andhra Prabha Latest News

3.6 Crore Ferry Auction : ఫెర్రీ రేవు వేలం వ‌ర్రీ Andhra Prabha Latest News

  • కుప్పకూలిన ఎం పి డి ఓ
  • న‌ర్సాపురంలో సంచ‌ల‌నం
  • గుత్తేదారుల ఒత్తిడి
  • బెదిరింపుల ఆరోపణలు

( నర్సాపురం , ఆంధ్ర ప్రభ)

నర్సాపురం మండల డెవలప్​ మెంట్ అధికారి నాసరురెడ్డి కార్యాలయం లో కుప్పకూలారు. యదావిధిగా గురువారం విధులకు హాజరయ్యారు. స్థానిక కార్యాలయం లో ఈ రోజు ఉదయం మాధవాయపాలెం ఫెర్రీ వేలం పాట కు ఆయన హాజరు కావాల్సి ఉంది. ఇందుకు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. గుత్తేదారులు హాజరయ్యారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సమావేశ మందిరంలో జరగనున్న వేలం పాటకు మెట్లు ఎక్కుతున్న సమయం లో మెట్లు పైనే కుప్ప కూలారు. పక్కనే ఉన్న సిబ్బంది పట్టుకుని సోఫా లో పడుకోబెట్టారు. వళ్లంతా చెమటలుపట్టి ఆందోళనకు లోనవుతున్నట్లు కనిపించారు. వెంటనే సమీపంలోని ప్రైవేట్ వైద్యుడు ను తీసుకొచ్చి బి పి షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుట పడలేదు. మెరుగైన వైద్యం కోసం తక్షణం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

3.6 Crore Ferry Auction : ఒత్తిళ్లలొ ఎం పి డి ఓ….?

నర్సాపురం పట్టణ పరిధిలోని మాధవాయపాలెం ఫెర్రీ రేవు పాట అధికారులకు కత్తి మీద సవాల్ గా తయారయ్యింది. ప్రతీ ఏటా నిర్వహించే ఈ ప్రక్రియకు అధికారులు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు. విధి నిర్వహణలో భాగం అయినప్పటికీ ఫెర్రీ రేవు వేలం పాట ప్రక్రియ మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక పక్క ఉన్నత స్థాయి అధికారులు, మరో పక్క పాట దారులు ఒకరిపై ఒకరు తరచూ ఒత్తిళ్లకు గురి చేయడం తో మానసికంగా కుంగి పోతున్నట్లు ఉద్యోగులు తెలిపారు. తొలి సారి నిర్వహించిన రేవు పాట సమయంలో కూడా ఆయన ఒత్తిళ్లకు గురై కళ్ళు తిరిగి పడిపోయినట్లు సిబ్బంది తెలిపారు.

ని3.6 Crore Ferry Auction : బంధనలకు లోబడి…

ప్రభుత్వ నిబంధనలకు లోబడి రేవు పాట ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఫెర్రీ లు ఉన్నవారే వేలం పాటలో పాల్గోవాలనే నిబంధనను కొంతమంది గుత్తేదారులు వ్యతిరేకించి సదరు నిబంధనను సడలించాలని ఎం పి డి ఓ ను కోరారు. తన పరిధిలో లేదని ఉన్నత స్థాయి అధికారులను సంప్రదించాలని సూచించారు. అయినప్పటికీ కొంతా మంది గుత్తేదారులు రేవు పాట పై అభ్యంతరం వ్యక్తం చేయడమే గాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా సిబ్బంది తెలిపారు. ఎం పి డి ఓ కు వస్తున్న బెదిరింపు కాల్స్ వల్లే ఆయన మానసిక ఒత్తిళ్లకు లోనై అపస్మారక స్థితికి చేరినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ నిబంధనలకు లోబడే రేవు పాట జరుగుతుందని, నిబంధనలను అతిక్రమించే అధికారం ఎవరి చేతిలో లేదని ఉద్యోగులు అభిప్రాయ పడ్డారు.

Leave a Reply