బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్…
299వ డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్…
మేడ్చల్, ఆంధ్రప్రభ : భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు గుండ్లపోచంపల్లి 299వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా 299వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ మాట్లాడుతూ… దేశానికి తొలి ఉప ప్రధానమంత్రిగా, కార్మిక మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఎన్నో చట్టాలను తీసుకొచ్చి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. దళిత, పీడిత వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని, సుమారు 40 ఏళ్లపాటు వివిధ మంత్రి పదవుల్లో ఉండి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు.
1935లో అంటరానితనం నిర్మూలనకు, సమానత్వం కోసం ‘ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్’ను స్థాపించడంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నర్సింగ్ రావు, మహేష్, నటరాజ్, మల్లికార్జున్, ప్రవీణ్, బాలరాజు, మాజీ సర్పంచ్ బండారి నరేందర్, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, దొడ్ల మల్లికార్జున్, గుండ్ల పోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి, మలిగే అశోక్, వెంకట్, ఉదయ్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యులు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
