24 hours | ఇంటిపై కొడీ గుడ్లు, టమోటాలతో దాడి…

24 hours | ఇంటిపై కొడీ గుడ్లు, టమోటాలతో దాడి…

హిందువులపై అనుచిత వాక్య‌లు చేసినందుకు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి.
అడ్డ గించి పోలీస్ స్టేషన్‌కు తరలించిన మేడిపల్లి పోలీసులు..

24 hours | బోడుప్పల్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : హిందువులను కించపరిచే విధంగా అనుచిత వాఖ్యలు చేసిన తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు వాఖ్యలను ఖండిస్తూ బోడుప్పల్ లోని మందుల సామేలు బీజేపీ, బీజె వై ఎం నాయకులు ఇల్లు ముట్టడించారు. ఈ సందర్భంగా కోడిగుడ్లు, టమాటాలతో వారు ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎమ్మెల్యే సామేలు 24 గంటల్లో హిందువులకు క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో ఎలక్షన్ సమయంలో ఆలయాల వద్దకు వచ్చి దండాలు పెట్టి నన్ను గెలిపించండి అని, ఈరోజు హిందువులను కించపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. బేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పాలని లేనియె డల ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సందర్భంగా మేడిపల్లి పోలీసులు బీజేపీ, బీజేవైఎం నాయకులను అడ్డగించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply