22వ వార్డులో జోరుగా ప్రచారం

22వ వార్డులో జోరుగా ప్రచారం

  • బీజేపీ అభ్యర్థి కొలనుపాక భద్రయ్య

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 22 వ వార్డులో బిజెపి అభ్యర్థి కొలనుపాక భద్రయ్య ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మతో ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల గురించి వివరిస్తూ 22 వార్డుల్లో వివిధ కాలనీల్లో ప్రచారం విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది. ఓటర్లు ఆదరిస్తే వార్డు సమస్యలు పరిష్కరించి వార్డు అభివృద్ధి చేస్తానని బిజెపి 22వ వార్డు అభ్యర్థి కొలనుపాక భద్రయ్య వార్డులోని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 22వ వార్డు బిజెపి పార్టీ అభ్యర్థి కొలనుపాక భద్రయ్య ఇంటింటి ప్రచారంలో భాగంగా గెలుపే లక్ష్యంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. 22వ వార్డులో ఓటర్లు బిజెపి పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి, బీజేవైఎం నాయకులు కొలనుపాక అనిల్, కొలనుపాక సిద్దు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply