ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికార పార్టీ

20వ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి గాదె సత్యం
ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమరుపరచని పార్టీ
కార్పొరేషన్ కు ఏమీ అభివృద్ధి చేస్తారు
మంచిర్యాల ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) : ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు పరచని పార్టీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కు ఏమి అభివృద్ధి చేస్తారని మంచిర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ భారతీయ రాష్ట్ర సమితి కార్పొరేటర్ అభ్యర్థి గాదె సత్యం అన్నారు. బుధవారం పట్టణంలోని మారుతీ నగర్,సావిత్రి నగర్, అంబేద్కర్ కాలనీ,శ్రీ సాయి కాలనీలలో కారు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టిఆర్ఎస్ అభ్యర్థులతో ప్రచారానికి వెళితే కాంగ్రెస్ పార్టీ పేరుతో నాయకులమని చెప్పుకొనే వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటు అన్నారు.420 హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో త్రొక్కిందని ప్రజలను మోసం చేయడం అలవాటయినా వారికి చేతల్లో పనిచేయడం సాధ్యం కాదన్నారు.బంగారు తెలంగాణ లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కెసిఆర్ రాష్ట్రంలోని పది జిల్లాలను విభజించి అభివృద్ధికి ముందు బాట వేయడం జరిగిందని.వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు మంజూరు చేసి వారింట్లో బిడ్డగ మారిందని, కులవృత్తులకు నిధులు మంజూరు చేసి వారికి పెద్దన్న అయ్యాడని, కళ్యాణ లక్ష్మి పథకంతో ఆడబిడ్డలకు అన్నయ్యనాడని కెసిఆర్ తెలంగాణ జాతిపిత కలలు కన్న స్వరాజ్యం కొరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లో కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు అర్జున్, డివిజన్ ఇంచార్జ్ దామోదర్, నాయకులు మహమూద్, గొడుగు ఆశీర్ విల్సన్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
