2026 diary | అన్నీ అవేగా?

2026 diary | అన్నీ అవేగా?
వంటింట్లో కుక్కర్ తో…కూరగాయలతో..కుస్తీ పడుతోంది కామాక్షి…ఒకపక్క కూరగాయలు తరుగుతూనే కుక్కర్ విజిల్స్ లెక్కబెడుతూ…పాలుపొంగుతాయేమో అని ఓ కంట గమనిస్తూ…ఇడ్లీలు రెడీ అయ్యాయేమో మూత తీసి చూస్తూ..బాత్ రూంలో గీజర్ వేసి ఎంతసేపయిందో గుర్తు చేసుకుంటూ…ఇలా ఏకకాలంలో అష్టావధానాలూ శతావధానాలూ(Octaves and Shatavadhanas) చేసేస్తోంది….ఇదంతా దేనికో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు…ప్రతి ఇంట్లో ఇల్లాలూ చేసే అవధానాలే ఇవి… వారు అలా కాలంతో పోటీ పడి అన్నీ రెడీ చేస్తేనే వారి భర్త, పిల్లలకు, తమకు టిఫిన్లూ, లంచ్ బాక్సులూ అందేది..లేదా…ఉపవాసాలో, బయటి తిండ్లో గతి….అందుకే ఆ గంట వారికి చాలా కీలకం. మధ్యమధ్యలో హాల్లోంచి, బెడ్ రూం ల లోంచి భర్త, అరుపులు, పిల్లల కేకలు…అది దొరకలేదనో, ఇది కనిపించడం లేదనో…అక్కడే ఉంటుంది…చూసుకోండని ఇల్లాలు వంటింట్లోంచి కేకవేసి చెప్తే వారికి కోపం…తమను పట్టించుకోవట్లేదని అలక…తమపై శ్రద్ధ(Take care of yourself) పోయిందని సణుగుడు…ఇదంతా ఎందుకని, ఇల్లాలే వెళ్ళి చూసే సరికి వారు వెతుకుతున్న వస్తువేదో ఆ పక్కనే ఉంటుంది…
ప్రస్తుతం కామాక్షి కూడా చేస్తోన్న ప్రయత్నం…భర్త గురుమూర్తి గారికి అన్నీ సిద్ధం చేసి ఆఫీసుకు పంపాలనే…అమ్మాయి కాలేజీకీ, అబ్బాయి స్కూల్ కీ వెళ్ళిపోయారు. సగం ఊపిరి పీల్చుకుంది. మిగిలింది భర్త గారి పనే. ఒకపక్క హాల్లోని గడియారం చూస్తూ…ఏ నిముషాన ఆయన గారి కేక వినిపిస్తుందో నని అలెర్ట్ గా ఉంది….”కామాక్షీ…టిఫిన్ రెడీయా…కామాక్షీ….గీజర్ నిండిందా….కామాక్షీ లంచ్ పెట్టావా…” ఏ క్షణాన ఆయన కేక వినిపించినా అన్నిటికీ సమాధానాలు రెడీ చేసుకుంటోంది…
కష్టపడి చదువుకున్న కొశ్చెన్లేవీ ఎగ్జాం లో రాకపోతే స్టూడెంట్ హర్ట్(Student Hard) అయినట్టుగా నిరుత్సాహపడింది కామాక్షి…ఇంత అలెర్ట్ గా అన్నీ సిద్ధం చేసి, ఆయన ఏదడిగినా ఆన్సర్లు రెడీ చేసుకుంటే, అసలు కొశ్చెన్లే రావేంటీ? అని ఆశ్చర్యపోయింది కూడా…
కానీ, కేక కాదుకదా, కనీసం హాల్లో ఆయన అలికిడి కూడా లేదు. దాదాపు తన పనులన్నీ ఒక కొలిక్కి వచ్చాక, పైట కొంగుతో చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది…అక్కడ కనిపించిన దృశ్యం
చూసి ఆశ్చర్యపోయింది…
అక్కడ…కుర్చీలో తీరుబడిగా కూర్చుని…ఎదురుగా ఏదో పుస్తకం పెట్టుకుని, ఆకాశం…సారీ పైకప్పుకేసి చూస్తూ..మధ్యమధ్యలో పుస్తకంలో ఏదో బరబరా రాసేస్తున్నాడు గురుమూర్తి.
ఆలోచనలు రావడానికి గుప్పుగుప్పున పొగ పీలుస్తూ(Inhaling smoke in a puff)…వదులుతూ..హాలంతా పొగతో నింపేడు కూడా….కామాక్షి చిరాగ్గా మొహం పెట్టి, గబగబా వెళ్ళి కిటికీలన్నీ తెరిచి, ఫ్యాన్ పెంచింది…క్షణాల్లో హాల్లో నిండిన పొగంతా బయటికి పోయింది.
“ఏం రాస్తున్నారండీ?” అడిగింది భర్తని..
ఆ మానవుడి నుంచి సమాధానం రాలేదు.
“మిమ్మల్నే…ఆఫీసుకి రెడీ అవరా?” వాయిస్ వాల్యూం పెంచి అడిగింది…
ఒక్కసారి తల తిప్పి(Turn your head once) భార్యకేసి చూసి, తలను అడ్డంగా…నిలువుగా ఊపాడు గురుమూర్తి..వెళ్తాననో, వెళ్ళననో, అందులో ఏ భావమూ కనిపించలేదు కామాక్షికి.
ఇలా లాభం లేదనుకుని, తానే భర్త దగ్గరకొచ్చి, అతడు రాస్తున్న పుస్తకంలోకి మొహం పెట్టి చూసింది…
కాస్తంత చిరాకు…కాస్తంత విసుగు..మరికాస్తంత ఆశ్చర్యం కలగలిపి భర్తగారి మొహంలోకి చూసింది…
ఆమె ఉద్దేశమేంటో…ఏం సమాధానం ఆశిస్తుందో తెలిసినవాడిలాగా గురుమూర్తి “అదికాదోయ్..మరో రెండ్రొజుల్లో పాత ఏడాది వెళ్ళిపోతుంది కదా…”అంటూ నసిగాడు..
“ఆ..వెళ్ళిపోతుంది, కొత్త ఏడాది వచ్చేస్తుంది కూడా…అయితే…?”
“అదే…కొత్త ఏదాది…కొత్త నిర్ణయాలూ(New decisions)….” అర్థోక్తిలో ఆగిపోయాడు…
“ఆఫీసుకు రెడీకాకుండా కూర్చుని తమరు చేస్తున్న ఘనకార్యం ఇదా….” అంటూ గబగబా బెడ్ రూం లోకెళ్ళి ఏదో వెతకసాగింది కామాక్షి.
ఆమె దేనికోసం వెతుకుతుందో తెలిసీ తెలియని అయోమయంతో అటువేపు చూడసాగాడు గురుమూర్తి.
అతడి అయోమయానికి తనచేతిలో సమాధానంతో వచ్చింది కామాక్షి. గబగబా తెరిచి…ఒక పేజీ దగ్గర ఆగి, “చదువుతాను..రాస్కోండి” అంటూ చదవడం మొదలెట్టింది…
“సిగరెట్లు తగ్గించడం…క్రమంగా మానెయ్యడం…..
సొంత ఇంటికోసం లోను ట్రై చెయ్యడం…ఇంక్రిమెంట్ కోసం గట్టిగా ట్రై చెయ్యడం…
మందు వారానికి రెండుసార్లకు తగ్గించడం..క్రమంగా మాన్యెయ్యడం…”
అప్పజెప్పినట్టుగా చదవసాగింది…
ఆమె చదువుతున్నవి రాయకుండా…తననే ఆశ్చర్యంగా(Astonishingly) చూడసాగాడు గురుమూర్తి.
చదవడం ఆపి, భర్తకేసి చూస్తూ..”ఆగిపోయారేం రాసుకోండీ…ఇవన్నీ ఎక్కడో చూసినట్టనిపిస్తోందా? తమరు రాసిందే పోయినేడాది…అంతకుముందు డైరీలోనూ ఇవే ఉన్నాయి…” ఆమె మాటల్లో కొత్తగా రాయడం వ్యర్థమనే మీనింగు కొట్టొచ్చినట్టు కనిపించింది గురుమూర్తికి.
కొట్టొచ్చినట్టు కాదు, కొడుతుందేమో అన్నంత భయం కూడా కలిగిందతడికి.
ఆచరణలో పెట్టని నిర్ణయాలెందుకండీ? అవే తప్పులు చేస్తూండేట్టయితే మానేస్తామని మళ్ళీ మళ్ళీ అనుకోడమెందుకు? రాస్తూనే ఉన్నాం…చేస్తూనే ఉన్నాం. మానేయడం సంగతి దేవుడెరుగు(God knows)..కొత్త ఏడాది మందు లేకుండా స్టార్ట్ చెయ్యగలరా? మానెయ్యాలని రాస్తూనే పది సిగరెత్ట్లు కాల్చారు…కొత్త ఏడాదులు వస్తూనే ఉన్నాయి…పాతవైపోతూనే ఉన్నాయి గానీ…రాయడం ఆపి ఆఫీసుకి తయారవండి…టిఫిన్ పెడతాను…కావాలంటే నేనే రాసి మీరు ఆఫీసునుంచి వచ్చే సరికి రెడీగా ఉంచుతాను సరా?” అంటూ అతడి చేతిలోని పెన్ను లాక్కుని, పాత, కొత్త డైరీలు రెండూ పక్కకు పెట్టేసింది.
భార్యమాటను జవదాటలేని గురుమూర్తి…కాదనలేనన్నట్టు లేచి ఆఫీసుకు రెడీ అవడానికి బెడ్ రూం కేసి నడిచాడు.
