ప్రచారంలో దూసుకుపోతున్న వెంకన్న బాబు

ప్రచారంలో దూసుకుపోతున్న వెంకన్న బాబు
- 18 వ వార్డు ప్రజలు వెంకన్న వైపే
అశ్వారావుపేట రూరల్, ఆంధ్రప్రభ : అశ్వరావుపేట మున్సిపాలిటీలో 18వ వార్డు నుంచి బరిలో ఉన్న తిరుమల శెట్టి వెంకన్న బాబు విజయం వైపు దూసుకెళుతున్నారు. వార్డు పరిధిలోని ఓటర్లు ఆయన వెంట నడుస్తూ వెంకన్న బాబు నాయకత్వం కావాలని కోరుతున్నారు. ఈనెల 11న జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలలో మునిసిపాలిటీ పరిధిలోని ప్రాంతంలో 18వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరుమల శెట్టి వెంకన్న బాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
పార్టీ అధిష్టానం ఇప్పటికే టికెట్ ఖరారు చేయడంతో గడిచిన వారం రోజులుగా వెంకన్న బాబువార్డు పరిధిలోని పార్టీ నేతలు అందరిని కలుపుకుని పోయి అన్ని ప్రాంతాలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ గడిచిన రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను అలాగే రానున్న రోజుల్లో అమలు చేయనున్న పథకాలను కూడా ప్రజల్లో తీసుకుని వెళ్లి ప్రచారం చేస్తున్నారు.

హస్తం గుర్తుపై వార్డు ప్రజలు ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకన్న బాబు మాట్లాడుతూ వార్డు పరిధిలోని సమస్యల పట్ల తనకు విశేషమైన అనుభవం ఉందని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి శాయ శక్తులా కృషి చేస్తానని ఓటర్లు తనను ఆదరించి కౌన్సిలర్గా గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. గడిచిన రెండు రోజుల నుండి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ తో కలిసి వార్డు పరిధిలోని పలు ప్రాంతాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
