Warangal | విద్యుత్ షాక్ తో.. 18గొర్రెలు మృతి

నెక్కొండ, జులై 9, (ఆంధ్రప్రభ) : గొర్రెల షెడ్డుపై ఉన్న 11 కెవి విద్యుత్ కు వైరు తెగి షెడ్ పై పడడంతో 18 గొర్రెలు (sheeps) మృతిచెందగా మరికొన్ని గొర్రెలు తీవ్ర అస్వస్థకు గురయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా (Warangal District) నెక్కొండ (Nekkonda) మండలంలోని పెద్దకోర్పోల్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నూకల లక్ష్మి తన గొర్రెలను షెడ్డులో ఉంచగా షెడ్డు సమీపంలో ఉన్న 11 కెవి విద్యుత్ వైరు తెగి షెడ్ పై పడింది. దీంతో విద్యుత్ షాక్ (electric shock) తో షెడ్డులో ఉన్న 18 గొర్రెలు మృతి చెందాయి. మరికొన్ని గొర్రెలు తీవ్ర అస్వస్థకు గురయ్యాయి.

తనకు మూడు లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు. గ్రామంలో గృహ నిర్మాణాలపై ఉన్న 11 కెవి విద్యుత్ వైర్లను తొలగించాలని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని వారి నిర్లక్ష్యం కారణంగానే గొర్రెలు మృతి చెందాయని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply