18 గంట‌ల ద‌ర్శ‌న భాగ్యం

18 గంట‌ల ద‌ర్శ‌న భాగ్యం

మ‌హానందీశ్వ‌రాల‌యంలో రేప‌టి నుంచి కార్తీక మాస పూజ‌లు
ఆలయ కార్య నిర్వహణ అధికారి నల్లకాలువ శ్రీనివాసరెడ్డి వెల్ల‌డి

నంద్యాల బ్యూరో అక్టోబర్ 21 ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలోని మహానందీశ్వర ఆలయంలో ఈనెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీకమాస వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి నల్లకాలువ శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. కార్తీక మాసం ముగిసే వరకు ఆన్ లిమిటెడ్ ,ఆన్ స్టపబుల్ ,జంబో దర్శనం లాగా భక్తులకు మహానందీశ్వరుడు,శ్రీ కామేశ్వరి దేవి ఆలయంలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసంలో రూ 2వేల రూపాయలు చెల్లించిన భక్తులకు ఆన్ లైన్ లో గోత్రం,పేరు తెలిపిన వారికి వారి పేరు పైన మహానంది ప్రధాన ఆలయంలో అభిషేకం నిర్వహిస్తామన్నారు. అనంతరం వారికి ప్రసాదం,తీర్థం పోస్ట్ ద్వారా పంపుతామన్నారు. భక్తులకు ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటలవారుకు దేవాలయంలో దర్శనం ఉండదని తెలిపారు.కార్తీక మాసంలో నాలుగు సోమవారాలలో దేవాలయంలో శివునికి జలహారతి ఇస్తామన్నారు.ఆది,సోమవారం లలో భక్తుల అత్య‌ధికంగా ఉండటంతో గర్భాలయంలో అభిషేకాలు రద్దు చేస్తామన్నారు.భక్తుల కోసం సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు పొచ భవనంలో ఉచితంగా విశ్రాంతి అవకాశం కల్పిస్తామన్నారు.భక్తుల వాహనాలు కోసం లైటింగ్ వసతిలో రెండు పార్కింగ్ స్థలాలను కూడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Leave a Reply