గెలిపించండి అభివృద్ధి చేస్తా

గెలిపించండి అభివృద్ధి చేస్తా
- 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి మానస హనుమంతు
మక్తల్ , ఆంధ్రప్రభ ; మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మీ బిడ్డగా మీ ముందుకు వచ్చా ఆదరించండి ఆశీర్వదించండి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి మానస హన్మంతు ఓటర్లకు విన్నవించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తన మద్దతు దారులతో కలిసి జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలుసుకొని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు .మీ బిడ్డను మీ మధ్యనే పుట్ట మీ మధ్యనే పెరిగా మీ మధ్యనే ఉంటా మన ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం అండగా నిలవండి అని అభ్యర్థించారు. మక్తల్ ముద్దుబిడ్డ మన ప్రాంత బిడ్డ వాకిటి శ్రీహరి మంత్రిగా ఉన్నారు మంత్రి సహకారంతో 14వ వార్డును అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని అన్నారు. అభివృద్ధి కోసం తనను కౌన్సిలర్ గా గెలిపించాలన్నారు. ప్రతిపక్ష పార్టీల మాయమాటలు నమ్మి మోసపోయి గోసపడవద్దని విన్నవించారు.
గతంలో గెలిచినవారు ఏమీ చేయలేకపోయారని ప్రస్తుతం మంత్రి సహకారంతో మక్తల్ ను మంచి పట్టణంగా తీర్చిదిద్దుకుందామని అన్నారు .అభివృద్ధి సంక్షేమ పథకాలు 100 శాతం అమలు కావాలంటే అధికార పార్టీ అభ్యర్థులుగా తమను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. 24 గంటలపాటు మీ అందరికీ అందుబాటులో ఉండి ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు.
ప్రస్తుతం సీసీ రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుందని మరింత అభివృద్ధి కోసం 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి 14వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి మానస హన్మంతు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వాకిటి శ్యామ్, బి. రమేష్, వాకిటి కిష్టప్ప, డి .రమేష్ ,రాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, నాగు, నాగరాజ్ ,ఏఎంసి డైరెక్టర్ అంజి,గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.
