13వ వార్డులో ప్రజా మద్దతుతో కాంగ్రెస్ హోరు..

-ప్రచారంలో దూసుకుపోతున్న యువనేత తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ)

-ఎమ్మెల్యే, ఎంపీ అండతో బలమైన ప్రచారం
-సంక్షేమ పథకాలే గెలుపు గుర్రాలుగా వినయ్ విశ్వాసం

స్టేషన్ ఘన్‌పూర్, ఫిబ్రవరి4, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం హోరెత్తుతోంది. ఈ క్రమంలో 13వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువనాయకుడు తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ) తన దూకుడైన ప్రచారంతో రాజకీయ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారారు. సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వినయ్, నేడు ప్రజల మద్దతుతో ముందుకు సాగుతూ ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసురుతున్నారు.

-ఎమ్మెల్యే,ఎంపీ అండతో ప్రచారానికి ఊపు:

వార్డులోని స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి బుధవారం వినయ్ కుమార్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ మారజోడు రాంబాబు పాల్గొన్నారు. మీ బిడ్డ ను మీ ఇంటి పక్కనే ఉంటా ఏ వేళలో ఏ సమస్య వచ్చినా మీ ముందు కు వస్తాను..సమస్య పరిష్కారానికి కృషి చేస్తా మన ప్రాంత అభివృద్ధి కోసం తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మె ల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఆశీస్సులు తనకు అండగా ఉన్నాయని వినయ్ పేర్కొన్నారు. అభివృద్ధి అంటే మాటలు కాదు, చేతల్లో చూపించడమేనని స్పష్టం చేస్తూ 9వ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిది ద్దుతానని ఓటర్లకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, ఇతర సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతరం పోరాడతానని వినయ్ స్పష్టం చేశారు. అర్ధరాత్రి పిలిచినా స్పందించే సేవాభావం నాది అంటూ ప్రజల మనసు గెలుచు కుంటున్నారు. యువత, కాంగ్రెస్ యువజన విభాగం ఏకతా టిపై నిలబడి వినయ్ గెలుపు కోసం పనిచేస్తుండటంతో 9వ వార్డులో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది

Leave a Reply