అభివృద్ధి చేస్తా అవకాశం ఇవ్వండి

13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సరిత గోవింద్ రావు
మక్తల్ , ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 1౩ వాడు అభివృద్ధికి పూర్తిస్థాయి బాధ్యత తీసుకుంటా అభివృద్ధి కోసం తనను ఆదరించి ఆశీర్వదించి 13వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత గోవింద్ రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం మక్తల్ పట్టణంలోని 13వ వార్డులో మద్దతుదారులతో కలిసి విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఓటు వేయండి అంటూ అభ్యర్థించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో 13వ వార్డు అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు .గతంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఈ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అన్నారు. ఇప్పటికే సిసి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు .అనేక ప్రాంతాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం కొనసాగుతుందన్నారు. తనను గెలిపిస్తే 13వ వార్డు పరిధిలోని అన్ని గల్లీలో సీసీ రోడ్డు డ్రైనేజీలు ఏర్పాటు చేస్తానని అన్నారు .అధికార పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమని ఇతరుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆదరించి ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్గా గెలిపించవలసిందిగా సరిత గోవింద్ రావు విజ్ఞప్తి చేశారు.మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫయాజ్,నాయకులు సాగర్ అయ్య ,సురేంద్ర చారి, పాండు, శ్రీకాంత్, వాదిరాజ్, ఆంజనేయులు, సుందర్, శ్యాంసుందర్, నరసింహులు ,మహమ్మద్ బబ్లు తదితరులు పాల్గొన్నారు.
