మీ బిడ్డగా ఆదరించండి వార్డు అభివృద్ధి నా బాధ్యత

12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రహీం పటేల్
మక్తల్ , ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) మీ బిడ్డగా మీ ముందుకు వచ్చా ఆదరించండి ఆశీర్వదించండి కౌన్సిలర్ గా గెలిపించండి ఈ ప్రాంత అభివృద్ధి తన అభిభతంగా పనిచేస్తానని 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రహీం పటేల్ అన్నారు .బుధవారం తన మద్దతు దారులతో కలిసి ఆయన వార్డు పరిధిలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు .ఈ సందర్భంగా రహీం పటేల్ మాట్లాడుతూ మీ బిడ్డను మీ ఇంటి పక్కనే ఉంటా ఏ వేళలో ఏ సమస్య వచ్చినా మీ ముందుకు వస్తా సమస్య పరిష్కారానికి కృషి చేస్తా మన ప్రాంత అభివృద్ధి కోసం తనను గెలిపించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో 12వ వార్డులో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి మక్తల్ లోనే ఆదర్శ వార్డుగా 12వ వార్డును తీర్చిదిద్దుతానని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో వెనుకబడ్డ 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని రహీం పటేల్ పేర్కొన్నారు. మీ అందరి సహకారంతో వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి 12వ వార్డు కౌన్సిలర్ గా తనను గెలిపించాలని రహీం పటేల్ విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మద్దతు దారులు పాల్గొన్నారు.
