అభివృద్ధి చేయడం నా బాధ్యత

అభివృద్ధి చేయడం నా బాధ్యత

  • 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రహీం పటేల్

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను కౌన్సిలర్గా గెలిపించడం మీ బాధ్యత అభివృద్ధి చేయడం నా బాధ్యత ఆలోచించి ఓటెయ్యండి అభివృద్ధికి అండగా నిలవండి అంటూ 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రహీం పటేల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.గురువారం తన మద్దతు దారులతో కలిసి ఆయన వార్డు పరిధిలో జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో తనను ఎందుకు గెలిపించాలి తాను గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తాను అనే అంశాలను ఓటర్లకు వివరించి మద్దతు కోరారు.

ఈ సందర్భంగా రహీం పటేల్ మాట్లాడుతూ ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మన ప్రాంత అభివృద్ధి కోసం తనను గెలిపించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో 12వ వార్డులో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి మక్తల్ లోనే ఆదర్శ వార్డుగా 12వ వార్డును తీర్చిదిద్దుతానని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో వెనుకబడ్డ 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని రహీం పటేల్ పేర్కొన్నారు. మీ అందరి సహకారంతో వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి 12వ వార్డు కౌన్సిలర్ గా తనను గెలిపించాలని రహీం పటేల్ విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ గౌడ్ ,హుసామొద్దీన్ పెద్ద సంఖ్యలో మద్దతు దారులు పాల్గొన్నారు.

Leave a Reply