12క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలి

12క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలి

ఏడు క్వింటాళ్ల పత్తి కొనుగోలు నిబంధ‌న‌ను ఎత్తివేయాలి..


ఊట్కూర్, నవంబర్ 4 (ఆంధ్రప్రభ) : భారత పత్తి సంస్థ (సీసీఐ) ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటాం అనే నిబంధన ఎత్తివేసి గతంలో మాదిరిగా ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ సామాజిక కార్యకర్త హెచ్.నర్సింహా (H. Narasimha) సీసీఐ అధికారులను డిమాండ్ చేశారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా రైతులకు ఇబ్బందులు కలుగకుండా సీసీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ సంవత్సరం పత్తి కొనుగోలు కేంద్రాలలో సీసీఐ వారు తేమ,నాణ్యత ఏడు క్వింటాళ్ల పరిమితి అని కొత్త, కొత్త నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడి ఎకరాకు 3,4 క్వింటాళ్ల వస్తుందని ఈ నిబంధన పెట్టారా అని ప్రశ్నించారు.

దిగుబడి తగ్గింది వాస్తవే కాబట్టి ప్రభుత్వాలు రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం సరిగ్గా అనుకూలిస్తే ఎకరాకు 12 నుండి 15 క్వింటాళ్ల పత్తి పండుతుందని తెలిపారు. పాత నిబంధనలు పాటించి సీసీఐ అధికారులు పత్తి కొనే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply