11 Ycp Mlas Absent : ఈ రోజూ రాలేదు Andhra Prabha Assembly News

11 Ycp Mlas Absent : ఈ రోజూ రాలేదు Andhra Prabha Assembly News
- ఇది పవిత్ర యజ్ఞం
- తప్పుల్ని ఒప్పుకునే నిజాయతీ లేదు
- కనీసం పశ్చాతం లేదు
- భాగస్వాములైతే చరిత్రలో స్థానం
- వైసీపీ ఎమ్మెల్యేలకు చురకలు
- ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్)

“ కనీసం ఈ రోజైనా ఆ 11 మంది వస్తారని భావించాను. తీర్మానాన్ని బలపరిచి చేసిన తప్పులపై పశ్చాత్తాపం చెందుతారని ఆశించాను.కానీ చేసిన తప్పులను ధైర్యంగా ఒప్పుకునే నిజాయితీ వాళ్లకు లేదని అర్థమైంది… ఇది వారి విజ్ఞతకే వదిలేద్దాం”. అని ఏపీ అసెంబ్లీ సభాపతి చింతకాయల అయన్య పాత్రుడు.. ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలను తూర్పారబట్టారు. సాధారణంగా,, శాసన సభలో స్పీకర్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్మక్తం చేయరు, ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించాలని.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టే ముందు సభాపతి చింతకాయల అయన్న పాత్రుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక తీర్మానం సందర్భంలో భాగస్వాములవుతున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు.
11 Ycp Mlas Absent : ఆ 11 మందికి చురకలు

సభకు హాజరు కాని వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్.తీవ్రంగా ఎండగట్టారు. ఆయన మాటల్లోనే.. ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షకు ఈ సభ ప్రతిరూపం. రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే యజ్ఞమిది. ఈ పవిత్ర యజ్ఞంలో భాగస్వాములయ్యే అవకాశం లభించింది.

2014లో చుక్కాని లేని రాష్ట్రాన్ని తీరం చేర్చే బాధ్యత చంద్రబాబుకు ప్రజలు అప్పగించారు. చంద్రబాబు తన అపార అనుభవంతో ప్రగతి బాటలో నడిపేలా ప్రణాళిక రూపొందించారు. అందర్నీ సంప్రదించి భౌగోళికంగా కేంద్ర బిందువు అయిన అమరావతిని రాజధానిగా చేశారు. చంద్రబాబు నిర్ణయంపై గౌరవంతో అమరావతి రైతులు సహకరించారు… భూములిచ్చారు.

అమరావతి నిర్మాణ పనులు 2104-19 మధ్య కాలంలో మొదలయ్యాయి. కానీ 2019లో దురదృష్టవశాత్తూ ప్రగతి రథానికి అడ్డంకులు ఎదురయ్యాయి. 2019-24 మధ్య కాలంలో కనివినీ ఎరుగని రీతిలో వైపరీత్యాలతో కూడిన పాలన సాగింది. అని సభాపతి ఆవేదన వ్యక్తం చేశారు.
11 Ycp Mlas Absent : వాళ్ల చేతికి కొబ్బరికాయ దొరికింది

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజం.. కానీ పరిపాలన నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వాల పనులు కొనసాగించాలి… కొత్త పనులు చేపట్టాలి. కానీ దీనికి భిన్నంగా 2019-24 మధ్య కాలంలోని పాలకులు తన చేతికి కొబ్బరి కాయ దొరికినట్టుగా వ్యవహరించారు. రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకున్నారు. 2109-24 మధ్య కాలంలో ప్రగతి నిరోధక పోకడకల వల్ల రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కు వెళ్లింది. అని స్నీకర్ అయన్న పాత్రుడు వివరించారు.
11 Ycp Mlas Absent : రాజధాని రైతులు వీధిన పడ్డారు

రాజధాని కోసం భూములిచ్చిన రైతులు వీధినపడ్డారు… అవమానాలకు పాలయ్యారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా… శాశ్వత రాజధానిగా అమరావతికి శిలాక్షరాల్లో లిఖించాల్సిన అవసరం ఉందని ప్రజా ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. సీఎం చంద్రబాబు ధృఢ సంకల్పంతో చేసిన కృషి వల్ల రాజధాని విషయమై రాష్ట్ర విభజన చట్టంలో మార్పులు తెచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. దీని కోసం తీర్మానం చేసుకోవడానికి ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాం. రాష్ట్రాభివృద్ధి పట్ల చిత్తశుద్ధిని చాటి చెప్పే అవకాశమిది. అని అసెంబ్లీ సభాపతి అన్నారు.

