AP | చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో 11మందికి జీవిత ఖైదు

కర్నూల్ బ్యూరో (ఆంధ్రప్రభ) : కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2017 మే 21న కృష్ణగిరి మండలంలో వైఎస్సార్సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో 11మందికి జీవిత ఖైదుతో పాటు వెయ్యి చొప్పున జరిమానా విధించింది. ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 29 మంది సాక్షులను కోర్టు విచారించింది.

2017 మే 21న కృష్ణగిరి మండలంలో నారాయణ రెడ్డి హత్య జరిగింది. ఈ కేసులో 29 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. వాస్తవంగా ఈకేసులో మొత్తం 19మంది నిందితులు కాగా. ఇందులో ఐదు మందిపై నేరం రుజువు కాలేదు. ఇక కేసులో నిందితులుగా పేర్కొన్న, ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ. శ్యాంబాబు, దేవనకొండకు చెందిన కప్పట్రాళ్ల బుజ్జమ్మ పేర్లను గతంలోనే.. న్యాయస్థానం ఆదేశాల మేరకు తొలగించగా, ఇక ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న వ్యక్తి.. ఇటీవలనే అనారోగ్యంతో మరణించారు.

మొత్తంగా చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో 11మందికి జీవిత ఖైదు పడడం జిల్లాలో సంచలనంగా మారింది. ఫ్యాక్షన్ కిల్లాగా పేరొందిన కర్నూలు జిల్లాలో ఇలాంటి తీర్పులు.. ముద్దాయిలకు ముచ్చెమటలు పట్టించనున్నాయి. తీర్పు నేపథ్యంలో కర్నూలు జిల్లా కోర్టు వద్ద విషాదం అలుముకుంది. శిక్ష పడిన వ్యక్తులను తక్షణమే పోలీసులు సబ్ జైలుకు తరలించే ప్రయత్నంలో ఉండడంతో.. శిక్ష పడిన ఖైదీల బంధువుల రోదనలు మిన్నంటాయి.

Leave a Reply