10th Ward | నిత్యం ప్రజలకు సేవలు చేసేందుకు…

10th Ward | నిత్యం ప్రజలకు సేవలు చేసేందుకు…

10th Ward | కల్లూరు, ఆంధ్రప్రభ : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించేందుకు టిఆర్ఎస్ 10వ వార్డు పుల్లయ్య బంజర కౌన్సిలర్ బరిలో ఉన్నానని ఆదరించి గెలిపించుకోవాలని పదో వార్డ్ అభ్యర్థి పెద్ద బోయిన మల్లేశ్వరరావు కోరారు . ఆయన ఆంధ్రప్రభ తో మాట్లాడారు. కల్లూరు మున్సిపాలిటీ గా ఏర్పడిన తొలి దశలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని, ప్రజలు ఆదరించి గెలిపించుకుంటే మున్సిపాలిటీలో ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు.

మున్సిపల్ ఎన్నికలలో కారు గుర్తుపై తమ ఆమూల్యమైన ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని మరల అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుపై ఓట్లు వేసి ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు.

Leave a Reply