పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలి…

పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలి…
జైనూర్, ఆంధ్రప్రభ : ఈ నెలలో ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ కొమరం భీం అసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఆడ వెంకటేష్ కోరారు. గురువారం మండలంలోని పానా పటార్ ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థులకు త్వరలో 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయడానికి ఆ పాఠశాలలో ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులు ఆడ వెంకటేష్, జైనూర్ మయూర్ ఫోటో స్టూడియో నిర్వాకులు సిందే రాజు ఆధ్వర్యంలో దాతలు ఆసీస్ జెన్ జయంతి అనూష జైన్ సాకారంతో విద్యార్థులకు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులు ఆడ వెంకటేశ్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల నిర్భయంగా రాయాలని ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఉన్నత విద్యా చదువులకు 10వ తరగతి ప్రధాన మెట్టు అని మంచి ఫలితాలు సాధించేలా విద్యార్థులు పట్టుదలతో పరీక్షలు రాయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాలప్రధానోపాధ్యాయులు దారసింగ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
